గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని మరిచాయి : మంత్రి తలసాని

-

హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ స్టేడియంలో మంత్రి గురువారం ఫిష్​ఫుడ్​ఫెస్టివల్​ ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్.మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి తలసాని ​ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వీక్షించడానికి జనాలు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ నేపధ్యం లో మంత్రి ప్రసంగిస్తూ.. ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్​కి అందరు తరలి రావాలని అన్నారు. 600 మంది మహిళలకు ఫిష్​కుకింగ్​లో ట్రైనింగ్​ ఇచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 800 స్టాల్స్​ ప్రారంభమైనట్లు వెల్లడించారు మంత్రి. ఈ నెల 10 వ తేదీ వరకు ఫెస్టివల్​ జరగనున్నట్లు తెలిపారు.

Minister Talasani Srinivas Yadav | నిరుద్యోగులతో బీజేపీ రాజకీయం-Namasthe  Telangana

మత్స్యకారుల సంక్షేమానికి గత ప్రభుత్వాలు బడ్జెట్​లో రూ.10 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు ఆ బడ్జెట్​ను రూ.100 కోట్లకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం లో మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు మంత్రి తలసాని. సీఎం కేసీఆర్​ వారి సంక్షేమాన్ని కాంక్షించి ఎన్నో పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు ఆయన. వచ్చే రోజుల్లో అన్ని పట్టణాల్లో ఫిష్​ స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. డిగ్నిటీ భవన్ కి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు మంత్రి తలసాని.

 

 

Read more RELATED
Recommended to you

Latest news