ఫేషియల్‌ తర్వాత ఇలాంటి తప్పులు చేయకండి.. మొత్తం వృధా..!

-

ఈరోజుల్లో ఫేషియల్స్‌ చేయించుకోవడం చాలా కామన్‌ అయిపోయింది. అమ్మాయిలు అయితే ఇంట్లోనే చేసుకుంటారు. ఇక అబ్బాయిలు సెలూన్స్‌లో చేయిస్తుంటారు. ఎలా చేయించినా.. ఫేషియల్‌ తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే.. మీరు ఎంత ఖర్చుపెట్టి చేయించిన ఫేషియల్‌ అయినా వృధా అయిపోతుంది. మరి ఆ తప్పులేంటో చూద్దామా..!

Found! A Facial Kit For Every Skin Type

ఈ తప్పులు చేయకండి:

వ్యాక్సింగ్:

ఫేషియల్ తరువాత వ్యాక్సింగ్ చేయకూడదు. ఫేషియల్ చేయించుకునే కన్నా కనీసం రెండు మూడ్రోజుల ముందే వ్యాక్సింగ్, ప్లకింగ్ లాంటివి చేసుకోవాలి. ఫేషియల్ తరువాత చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా చేరి ఇతర సమస్యలొచ్చే ప్రమాదం ఉంది.

ముఖాన్ని తడమటం:

చాలా మందికి తరచూ ముఖాన్ని ముట్టుకునే అలవాటుంటుంది. అలా చేయడం వల్ల ముఖం మీద బ్యాక్టీరియా చేరి వేరే సమస్యలొచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖం కడుక్కున్నాక కూడా టవెల్ తో రుద్దకుండా సున్నితంగా అద్దండి. వైప్స్ వాడుతుంటే ఆల్కహాల్ లేనివి ఎంచుకోండి. ఫేషియల్‌ చేసిన తర్వాతే కాదు.. మాములప్పుడు కూడా పదే పదే ముఖంపై చేతులు పోనియ్యకండి.

వేడి దగ్గర ఉండటం:

ఫేషియల్ తరువాత ఎక్కువ వేడిలో, చెమట ఎక్కువగా వచ్చే చోట ఉండకండి. బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం, ముఖానికి మరీ దగ్గరగా వేడి ఆవిరి పట్టడం లాంటివి కూడా చేయొద్దు.

కెమికల్ పీల్స్:

ఫేషియల్ చేసుకున్న తరువాత కనీసం వారం రోజులు ఎలాంటి కెమికల్ పీల్స్ జోలికి పోవద్దు. లేదంటే వాటివల్ల చర్మం నల్లబడటం, దద్దుర్లు రావడం లాంటి సమస్యలు రావచ్చు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

సరిపడా నీళ్లు తాగడం:

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నీళ్లు తాగాలి. చర్మం తాజాగా కనిపించాలంటే సరిపడా నీళ్లు తాగాల్సిందే. యాంటీ ఆక్సిడెంట్లున్న ఆహారం తీసుకోవాలి. ఫేషియల్ తరువాత దద్దుర్లు, యాక్నె, దురద సమస్యలొస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

క్లెన్సర్:

తక్కువ గాఢత ఉన్న ఫేస్ వాష్ ఉపయోగించండి. లేదంటే రసాయనాల వల్ల చర్మం పాడవుతుంది.

తేమ

ఫేషియల్ తరువాత చర్మం కాస్త పొడిబారినట్లు అవుతుంది. కాస్త సున్నితంగా కూడా మారుతుంది. అందుకే తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వీలైతే మీ చర్మానికి తగ్గ మాయిశ్చరైజర్ కోసం ఒకసారి డెర్మటాలజిస్ట్ ని కలవండి.

సన్‌స్క్రీన్

ఫేషియల్ తరువాత సన్‌స్క్రీన్ కూడా మర్చిపోవద్దు. సున్నిత చర్మం మీద యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ తప్పకుండా ఎంచుకోవాలి. చర్మం రంగు మారకుండా, ర్యాషెస్ రాకుండా ఇది కాపాడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news