పవన్ కల్యాణ్​తో వంద సినిమాలైనా తీస్తాను : డైరెక్టర్ సముద్రఖని

-

తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘బ్రో’ సినిమా ప్రమోషన్స్​లో ఉన్న సముద్రఖని.. ఓ ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడారు. పవన్ కల్యాణ్ తో ఇంకో సినిమా చేస్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. రెండేంటి అవకాశం రావాలే గానీ.. వంద సినిమాలు చేయడానికైనా రెడీగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. తన దగ్గర చాలా కథలున్నాయని, పవన్ నుంచి పిలుపు రావడమే ఆలస్యం.. సినిమాలు చేసేందుకు తాను రెడీగా ఉన్నానని తెలిపారు.

ఇక బ్రో సినిమా గురించి మాట్లాడుతూ.. త్వరలోనే టీజర్ ను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలిపారు. ఫస్ట్ ఆఫ్ కు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని, సెకండ్ ఆఫ్ డబ్బింగ్ పనులు త్వరలోనే స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా జూన్ 28వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్​గా సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం రీమేక్.

Read more RELATED
Recommended to you

Latest news