బీజేపీ కర్ణాటకలో కుక్క చావు చచ్చింది – నడ్డాకు పేర్ని నాని కౌంటర్‌

-

జేపీ నడ్డాకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ కర్ణాటకలో కుక్క చావు చచ్చిందని.. నడ్డా మర్యాదగా మాట్లాడి ఉంటే బాగుంటుందంటూ ఎద్దేవా చేశారు. అడ్డంగా ఉన్న నడ్డా చాలా మాట్లాడారని ఆగ్రహించారు. టీడీపీ-బీజేపీ హయాంలో జరిగిన బెల్ట్ స్కాంలో ఏపీ బీజేపీ నేతల వాటా ఎంత..? ఢిల్లీ నేతల వాటా ఎంత..? అని నిలదీశారు. అటు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ల మీద హరీష్ రావుకు కోపం, ఈర్ష్య ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని.

హరీష్ రావు బాధపడలేకే కేసీఆర్ హరీష్ రావును పక్కన పెట్టి పన్మిషెంట్ వేశారని..2018లో హరీష్ రావు కేసీఆర్ కెబినెట్లో ఎందుకు లేరు..? అని నిలదీశారు. హరీష్ రావు చంద్రబాబును ఫాలో అవుతున్నారని… హరీష్.రావు సర్టిఫికెట్లు మాకేం అవసరం లేదు..? అని మండిపడ్డారు. హరీష్ రాలు సర్టిఫికెట్లు కాటాకేస్తే.. ఉల్లిపాయలు కూడా రావని… మమ్మల్ని విమర్శిస్తే.. మేం తిరిగి కేసీఆరును విమర్శిస్తామని హరీష్ రావు ఆలోచన ఉందంటూ నిప్పులు చెరిగారు. మేం కేసీఆరును విమర్శిస్తే హరీష్ రావు సంతోషించాలని అనుకుంటున్నారని.. మళ్లీ హరీష్ రావు మమ్మల్ని విమర్శిస్తే ఆ ఉబలాటం తీర్చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ అల్లుడు గిల్లుడు చూస్తూ ఊరుకుంటే.. మేం కేసీఆరుని విమర్శిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news