ప్రతి ఒక్కరు కూడా పప్పు, కూర అయిపోయాక పెరుగు అన్నం తింటుంటారు పెరుగు అన్నం తినేటప్పుడు పెరుగు అన్నం లో అరటి పండ్లని కలిపి తీసుకుంటూ ఉంటారు. మీకు కూడా ఆ అలవాటు ఉందా… పెరుగు అన్నం లో అరటిపండు వేసుకుని తింటూ ఉంటారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆహార నిపుణులు చెప్పిన దాని ప్రకారం చూస్తే అరటిపండు పెరుగు కలిపి తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు నుండి బయటకు రావచ్చు. బ్యాక్టీరియా క్యాల్షియం మినరల్స్ విటమిన్స్ ఉంటాయి.
విటమిన్స్, ఐరన్, ఫైబర్ అరటిపండు లో బాగా ఉంటాయి ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చూస్తాయి. అరటిపండు పెరుగు కలిపి మీరు అల్పాహారం సమయంలో తీసుకోవచ్చు. రోజంతా అలసటగా ఉండదు. బలహీనత కూడా ఉండదు. చాలామందికి రోజు నీరసంగా బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఉదయాన్నే అల్పాహారం సమయంలో పెరుగు అరటిపండుని కలిపి తీసుకుంటే మంచిది ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన శక్తి లభిస్తుంది సామర్థ్యం పొందొచ్చు. బలహీనత సమస్య నుండి బయటపడొచ్చు ఎనర్జిటిక్ గా ఉంటారు.
మలబద్ధకం సమస్య నుండి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది అరటిపండు ఎండుద్రాక్షలను కూడా మీరు పెరుగులో కలిపి తీసుకోవచ్చు. అప్పుడు ఈ సమస్య ఉండదు. అలానే కొంతమంది బరువు ఎక్కువగా ఉంటారు. బరువుని అదుపులో ఉంచుకోవాలని చూస్తారు. పెరుగు అరటిపండు రెండిట్లో పీచు పదార్థం ఉంటుంది ఆహారంలో పెరుగు అరటిపండు తీసుకుంటే పొట్ట ఎక్కువసేపు ఉంటుంది ఆకలి వేయదు బరువు కంట్రోల్ లో ఉంటుంది. వీటిలో ఉండే క్యాల్షియం ఎముకలకి బలాన్ని ఇస్తుంది పెరుగు అరటిపండుని అల్పాహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. పెరుగులో అరటి పండుని కలిపి తీసుకుంటే కొవ్వు కూడా కరుగుతుంది కొలెస్ట్రాల్ తగ్గి హృదయ సమస్యలేమీ లేకుండా ఉండొచ్చు.