బందరు సీటులో రాయుడు..జగన్ స్ట్రాటజీ అదేనా?

-

రాజకీయాల్లో చిన్న లీకైనా పెద్దగా అయిపోతుంది..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు పోలిటికల్ ఎంట్రీపై అదే జరుగుతుంది. ఎప్పుడైతే రాయుడు జగన్‌ని పొగుడుతూ ట్వీట్ చేశారో..అప్పటినుంచే ఆయన వైసీపీలో చేరుతున్నారని ప్రచారం వచ్చింది. ఇటీవల ఐపీఎల్ కప్ తో జగన్‌ని కలిశారు. ఇంకేముంది రేపో మాపో ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారని ప్రచారం వచ్చింది.

ఇక ఈ ప్రచారంలో కూడా వాస్తవాలు ఎక్కువగానే ఉన్నాయనే చెప్పవచ్చు. తాజాగా ఓ మీడియా చానల్ లో రాయుడు..జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. తన పోలిటికల్ ఎంట్రీపై కూడా దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా అధికారికంగా ఆయన వైసీపీలో చేరడమే మిగిలి ఉంది. అదే సమయంలో ఆయన జగన్ చేస్తున్న అభివృద్ధి గురించి చెబుతూ..అభివృద్ధి అంటే ఒక ఐటీ కంపెనీ తీసుకు రావడం కాదని, అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చేయడమని, ఉదాహరణకు బందరు పోర్టుని కడుతున్నారని, కృష్ణా డెల్టాని బంగారం చేయడమే తన లక్ష్యమని రాయుడు చెప్పుకొచ్చారు.

ఎప్పుడైతే రాయుడు బందరు గురించి మాట్లాడారో అప్పటినుంచి ఆయన..బందరులో పోటీ చేస్తారా? అనే కథనాలు వస్తున్నాయి. అయితే బందరు ఎమ్మెల్యే సీటులో పేర్ని నాని వారసుడు పోటీ చేస్తారు. ఇక బందరు ఎంపీగా వల్లభనేని బాలశౌరి ఉన్నారు. అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు రాయుడుకు ఎంపీ సీటు ఇస్తారని..బందరు ఎంపీ లేదా గుంటూరు ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం ఉంది.

ఈ రెండు సీట్లని బాలశౌరి, రాయుడు పంచుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సరే రాయుడు బందరు లేదా, గుంటూరు ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తారా? అంటే అది కాస్త డౌటే. టి‌డి‌పి, జనసేన పొత్తు ప్రభావం ఈ రెండు సీట్లపై ఎక్కువ. కాబట్టి రాయుడు అరంగ్రేటం ఫ్లాప్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. కానీ రాయుడు గెలిచి తీరడం ఖాయమని వైసీపీ అంటుంది. చూడాలి రాయుడు పోలిటికల్ ఇన్నింగ్స్ ఎలా అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news