అమెరికాలో అక్రమ వలసదారులని నిర్భందించి వారిని వెనక్కి పంపి, పిల్లలని ,తల్లి తండ్రులని వేరు చేసి ఇలా రకరకాలుగా అక్రమ వలసవాసులని ఇబ్బంది పెట్టారు అమెరికా అధికారులు. అక్రమ వలసలని ఆపడం కోసం ఏకంగా సరిహద్దుల్లో గోడని సైతం నిర్మిస్తానని చెప్పిన ట్రంప్ ఆదిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. అయితే తమ దేశంలోకి అధికభాగం అక్రమ వలసదారులు ప్రవేశించేది మెక్సికో సరిహద్దుల ద్వారానే కావడంతో మెక్సికో ని తీవ్రస్థాయిలో హెచ్చరించడంతో…
ఇప్పుడు మెక్సికో సైతం అక్రమ వలసదారులపై కటినమైన వైఖరిని అవలంభిస్తోంది. మెక్సికో లో అక్రమంగా ఉంటున్న వారిని ఏరివేత మొదలు పెట్టి సుమారు 311 మంది అక్రమ వలస భారతీయులని గుర్తించి వారిని ఇండియా పంపే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం గుర్తించిన వారిని ప్రత్యేక విమానంలో ఢిల్లీ పంపిస్తున్నట్టుగా తెలిపింది. వారివద్ద అధికారిక ద్రువపత్రాలు లేవని భారత అధికారులకి తెలిపింది.
ఇదిలాఉంటే మెక్సికో పంపుతున్న 311 మంది భారతీయుల వివరాలని భారత అధికారులు ధ్రువీకరించారు. వారి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతోనే వారు పంపివేయబడుతున్నారని తెలిపింది. అయితే మెక్సికో నుంచీ అమెరికా వలస వెళ్ళిన వారిలో అత్యధికులు భారతీయులేనని మెక్సికో చెప్తోంది. అందుకే అక్రమ వలసల విషయంలో మేము ఖటినమైన వైఖరినే పాటిస్తామని స్పష్టం చేసింది.