డిప్లొమా కోర్సుల ఫీజులపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

-

డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణలో ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి డిప్లొమా కోర్సులను తీసుకురావాలని గతేడాది సాంకేతిక విద్య శాఖ ప్రతిపాదనలు చేసింది. సాంకేతిక విద్యా శాఖ ప్రతిపాదనలపై గతేడాది ఫిబ్రవరి నుండి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కౌన్సెలింగ్ ప్రారంభమైనందున ఫీజులు పెంచాలని హైకోర్టులో 5 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల పిటిషన్ నమోద చేశాయి. వివరణ ఇవ్వాలని ఆదేశించినా విద్యా శాఖ కార్యదర్శి స్పందించక పోవడంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. వారం లోగా విద్యా శాఖ నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ తరుఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

Supreme Court Collegium Recommends Elevation Of 6 Advocates As Judges Of Telangana  High Court

విద్యాశాఖ కార్యదర్శి వ్యక్తిగత హాజరుకు ప్రభుత్వ న్యాయవాది మినహాయింపు కోరారు. విద్యాశాఖ కార్యదర్శి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పాలిటెక్నిక్ కాలేజీలు కోరినట్లుగా ఫీజుల పెంపునకు అనుమతించక తప్పడం లేదని హైకోర్టు వెల్లడించింది. ఫీజు రూ.40వేలకు పెంచేందుకు 5 పాలిటెక్నిక్ కాలేజీలకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు. ప్రభుత్వం తక్కువగా ఫీజు ఖరారు చేస్తే విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని కాలేజీలకు హైకోర్టు షరతు విధించింది. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల ఫీజులపై తదుపరి విచారణ ఈనెల 26కి వాయిదా వేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news