చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన .. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. కొద్ది రోజులుగా హైదరాబాద్ కి చెందిన ప్రముఖ బిజినెస్ మాన్ కూతురు నీ ఆయన వివాహం చేసుకోబోతున్నారు అంటూ.. ఆమె ఒక సాఫ్ట్వేర్ అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి.
అంతేకాదు కోట్ల ఆస్తులను ఆయన కట్నం కింద తీసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు చాలా గట్టిగా వినిపించాయి. మరొకవైపు ఆగస్టులోనే నిశ్చితార్థం జరగనుంది అని.. ఆ త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ వార్తలపై రామ్ పోతినేని బాబాయ్ స్రవంతి రవి కిషోర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. స్రవంతి రవి కిషోర్ మూవీస్ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే స్వయంగా స్రవంతి రవి కిషోర్ హీరో రామ్ కి బాబాయ్ అవుతారు.
దీంతో రామ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన తాజాగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ రామ్ పెళ్ళి చేసుకోబోతున్నారంటూ వస్తున్నటువంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. ఒకవేళ రామ్ కి వివాహం కనుక నిశ్చయమైతే ఇక ఆ విషయం దాచాల్సిన అవసరం లేదు.. అందరితో ఈ విషయం తప్పకుండా పంచుకుంటాము అంటూ స్రవంతి రవి కిషోర్ రామ్ పెళ్లి గురించి క్లారిటీ ఇస్తూ కామెంట్లు చేయడం జరిగింది. ఇకపోతే ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికైతే రామ్ పెళ్లి వార్తలకు బ్రేక్ పడిందని చెప్పవచ్చు.