మొదటి రోజే రికార్డులు బద్దలు కొట్టిన ఆది పురుష్.. ఎన్ని కోట్లు అంటే..?

-

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ఆది పురుష్ .. జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటిరోజు ఊహించిన విధంగా వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇకపోతే ఒక్క తెలుగులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయం ఇప్పుడు చూద్దాం..

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..
నైజాం -రూ.50 కోట్లు
విశాఖపట్నం – రూ.12.5 కోట్లు
ఈస్ట్ – రూ .8 కోట్లు
వెస్ట్ – రూ .7కోట్లు
కృష్ణ – రూ. 7.5 కోట్లు
గుంటూరు – రూ.9కోట్లు
సీడెడ్ – రూ .17.5 కోట్లు
నెల్లూరు – రూ .4కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఏపీ , నైజాం లలో కలిపి రూ.115.5 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అలాగే హిందీ బెల్ట్ లో రూ.72 కోట్లు.. కర్ణాటకలో రూ.12.5 కోట్లు , వివిధ రాష్ట్రాలలో రూ.4.5 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. ఓవర్సీస్ లో తొలిరోజు రూ.30 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఇక హిందీ విషయానికి వస్తే.. హిందీ మాట్లాడే అన్ని ప్రాంతాలలో సుమారుగా రూ.50 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇకపోతే ఓవరాల్ గా ఇండియాలో రూ.140 కోట్ల కలెక్షన్స్ దాటింది. అడ్వాన్స్ బుకింగ్ లో కూడా ఓవర్సీస్ లో ఈ సినిమా భారీ రెస్పాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఆది పురుష్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు కలెక్షన్ల పరంగా కూడా పలు రకాల రికార్డులను బ్రేక్ చేసిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news