ఐటీ రైడ్స్ నాపై కక్ష సాధింపే: పైళ్ల శేఖర్ రెడ్డి

-

ఐటీ రైడ్స్ నాపై కక్ష సాధింపే అని బీఆర్‌ఎస్‌ పార్టీ, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఐటీ రైడ్స్ పై భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ…కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ నా నివాసంలో గంటన్నర పాటు సోదాలు జరిగాయని… కావాలనే ముడి రోజుల పాటు ఐ టి అధికారులు కాలయాపన చేశారని మండిపడ్డారు.


కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది ఐ టి అధికారుల తీరు అంటూ ఎద్దేవా చేశారు. ఇంకా ఏమన్నా దొరుకుతుందా అన్న దానిపై సోదాలు జరిగాయని… నా నివాసంలో ఏది దొరుకలేదన్నారు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను, నా. సతీమణి బెంగుళూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారన్నారు.

దానికి సంబందించిన డాక్యుమెట్స్ తీసుకున్నారని… ఆదాయ పన్ను చెలిస్తున్నాను… కావాలనే నా పై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహించారు. ఐ టి సోదాలు వెనుక ఏ పార్టీ హస్త ఉందో అందరికి తెలుసు అని… నాకు నోటీసులు అందజేసారన్నారు. నేను నిజాయితీగా ఉన్నానని… నా నియోజకవర్గం ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు బీఆర్‌ఎస్‌ పార్టీ, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news