తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు ప్రయాణించే పలు రైళ్లు రద్దయ్యాయి. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల నిర్వహణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తన ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 19వ తతేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
వారం రోజుల పాటు 25 రైళ్లను రద్దు చేయగా, ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంతకల్-బోధన్ రైలు సమయంలో తాత్కాలిక మార్పులు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు సేవలందించే 23 ఎంఎంటీఎస్ ట్రైన్లను సోమవారం నుంచి ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈనెల 24వ తేదీ వరకు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.