అకస్మాత్తుగా ఇంట్లో చెలరేగిన మంటలు.. ఐదుగురు సజీవదహనం

-

వీకెండ్ వచ్చేసిందని ఆ ఇంట్లో వాళ్లంతా ఒకచోటకు చేరుకున్నారు. సండే రోజు ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా.. జాలీగా గడపాలనుకున్నారు. అనుకున్నట్టుగానే సండే హాలిడే ప్లానింగ్ చేసుకున్నారు. ఈ ఎండలో బయటకు వెళ్లడం కంటే.. ఇంట్లోనే జాలీగా గడపడం బెటర్ అని ఇంటికే పరిమితమయ్యారు. కానీ ఓ ప్రమాదం ఆ ఇంటి వాళ్లనందరిని ఒకేసారి అనంత లోకాలకు తీసుకెళ్లిపోతుందని ఎవరూ ఊహించలేదు. అకస్మాత్తుగా ఇంట్లో చెలరేగిన మంటల్లో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన అమెరికా నార్త్​ కరోలినాలో ఓ ఇంట్లో చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మృతుల్లో ముగ్గురు పెద్దలు, ఇద్దరు యువకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఈ దుర్ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. ‘నార్త్​ కరోలినాలోని ఓ గ్రామీణ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మాకు సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాం. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారా? కాదా? అనేది ఇంకా తెలియలేదు.’ అని స్థానిక పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news