పవన్ ని ఉతికారేసిన ముద్రగడ పద్మనాభం

-

అధికార వైసీపీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కి గట్టిగా ఇచ్చేసాడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. లేని పోనీ విమర్శలతో టైమ్ వెస్ట్ చేసుకోవద్దని చెప్తూనే గట్టిగా క్లాస్ పీకారు. గుక్క తిప్పుకోనివ్వకుండా చురకలు అంటించారు. పైగా కాపు ఓట్లను గంప గుత్తగా చంద్రబాబుకి కట్టబెట్టేందుకు సిద్దమయ్యడంటూ పవన్ ని వాయించి పడేసాడు.వీధి రౌడీలా రెచ్చిపోవడం ఏంటని ప్రశ్నిoచారు. ఇంకా పలు రకాల ప్రశ్నలు సంధిస్తూ పవన్ కి బహిరంగ లేఖ రాశారు ముద్రగడ.

లేఖలో ముద్రగడ ఏమ్మన్నారంటే…. ఇంతవరకూ ఎంతమంది తాట తీసి చెప్పుతో కొట్టారో , ఎన్ని గుండ్లు గీశారని ప్రశ్నించారు.తాను ఏనాడూ ఓటమి ఎరుగలేదు అని చెప్తూ రెండు చోట్లా ఓడిపోయావుగా అని జనసేనాని ని వెక్కిరించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని సూచిస్తూ తాను ఏనాడూ కులాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోలేదని అన్నారు. కాపు నాయకులకు సీఎం పదవి ఇవ్వాలని పట్టుబడిన తత్వం తనదని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్,
స్టీల్ ప్లాంట్ అమ్మకం వంటి సమస్యల మీద పోరాడాలని చెప్తూ కులాన్ని అడ్డంపెట్టుకుని బతకడానికి తప్ప ప్రజాపోరాటాలకు పనికిరారని చురకలు అంటించారు.

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంతలా ఎందుకు టార్గెట్ చేస్తున్నావని ప్రశ్నించిన ముద్రగడ… రాజకీయాల్లో ఆ కుటుంబం ఎప్పటినుంచి ఉందొ గుర్తుచేశారు. దశాబ్దాలుగా ద్వారంపూడి కుటుంబం ప్రజాజీవనంలో ఉందని గుర్తు చేస్తూనే కాపు ఉద్యమానికి నిత్యం వారితోబాటు వారి తండ్రి , తాతయ్య సైతం వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. తాను ఎప్పుడు ఉద్యమం చేసినా అన్నివిధాలా వారి కుటుంబం సహకరిస్తూనే ఉండేదని, వాళ్ళని తిడుతూ టైమ్ వేస్ట్ చేసుకోవద్దని చెప్పారు.మొత్తానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికీ మాట్లాడడం రాదని ముద్రగడ తేల్చేశారు.

త్వరలో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. కాకినాడ లోకసభ నుంచి ఆయన పోటీ చేస్తారని సమాచారం. ఈ క్రమంలో ఆయన పవన్ ని టార్గెట్ చేస్తూ లేఖ విడుదల చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news