కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి గంగుల కమలాకర్. పొన్నం ప్రభాకర్ విలువ ఏంటో మునిసిపల్ ఎన్నికలలోనే బయటపడిందని అన్నారు. ఆయన కనీసం కార్పొరేటర్ ను కూడా గెలిపించుకోలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో దేశానికి రెండవ రాజధాని అంశం తెరపైకి వస్తుందని అన్నారు. తమది ఢిల్లీ పార్టీ కాదన్న ఆయన.. తెలంగాణ పార్టీ అని తెలిపారు.
ఎంఐఎం మాత్రమే కాదని.. నామీద కేఏ పాల్, షర్మిల కూడా పోటీ చేయవచ్చు అన్నారు. తన పని తాను చేసుకుంటూ వెళతానని.. తన జోలికి వస్తే విడిచిపెట్టబోటని హెచ్చరించారు. కరీంనగర్ లో తమకు 60% పాజిటివ్ ఉందని తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రెండవ స్థానం కోసం కొట్లాడాలని స్పష్టం చేశారు. తనపై పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ కేసులు వేశారని.. వాళ్ళిద్దరూ ఒకటేనని అన్నారు. అయినా ఈడి, ఐటి సిబిఐ విచారణలో ఏమి తేలలేదన్నారు.