తెలంగాణలోని పలు వైద్య కళాశాలల్లో ఈడీ సోదాలు

-

తెలంగాణలో ఎన్నికల హీట్ రోజురోజుకు పెరిగిపోతంది. హ్యాట్రిక్ కొట్టాలని అధికార బీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్.. బీజేపీలు పావులు కదుపుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం గుప్పిస్తున్నారు. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతోంటే.. ఇదే క్రమంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కూడా పెరుగుతున్నాయి.

ఇటీవలే బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని వైద్య కళాశాలలను టార్గెట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలోని ప్రతిమ వైద్య కళాశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కళాశాల యాజమాన్యం ఆఫీసు, ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. మహబూబ్నగర్లోని ఎస్‌వీఎస్ కళాశాల.. ఎల్బీనగర్‌లోని కామినేని వైద్య కళాశాలల్లో కూడా ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కళాశాలల ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news