వచ్చేవారంలో గ్రూప్‌1 ప్రిలిమినరీ కీ

-

తెలంగాణ గ్రూప్1 అభ్యర్థులకు అలెర్ట్. రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి ఈనెల 11న నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష ప్రాథమిక కీ వచ్చే వారంలో విడుదల కానుంది. ప్రిలిమినరీ కీతో పాటు ఓఎంఆర్‌ పత్రాల కాపీలను వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓఎంఆర్‌ పత్రాల ఇమేజింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ రెండు మూడు రోజుల్లో ముగియనున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఈనెల 11న నిర్వహించిన ప్రిలిమినరీ పునః పరీక్షకు 2,33,248 మంది హాజరైన విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబరు 16న జరిగిన పరీక్షతో పోలిస్తే దాదాపు 55 లక్షల మంది పరీక్షకు దూరంగా ఉన్నారు. ఇమేజింగ్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రిలిమనరీ పరీక్ష మాస్టర్‌ ప్రశ్నపత్రం, గ్రూప్‌-1 ప్రిలిమినరీ కీ టీఎస్‌పీఎస్సీ… వెబ్‌సైట్లో పొందుపరచనుంది. కీ పై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది కీ విడుదల చేయనుంది. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రయత్నాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news