Leo : లియో ఫస్ట్ లుక్.. తోడేలుతో వచ్చి విజయ్ విశ్వరూపం..

-

సూపర్ స్టార్ విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ సంవత్సరం వారసుడు సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు తలపతి. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.

ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం నుంచి దళపతి విజయ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఓ ఫైటింగ్ సన్నివేశంలో ఆగ్రహంగా ఉన్న ఆయన లుక్ ఆకట్టుకుంటుంది. ‘మాస్టర్’ తర్వాత విజయ్, లోకేష్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో త్రిష, అర్జున్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, మన్సూర్ ఆలీ ఖాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news