నడ్డా ఫోన్ చేసి తప్పుకోమంటే తప్పుకుంటా : బండి సంజయ్

-

కాంగ్రెస్ ను CM KCR లేపే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర BJP అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికల వరకే బిఆర్ఎస్ తో కాంగ్రెస్ కోట్లాట అని… వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. కర్ణాటకలో, మునుగోడులో కాంగ్రెస్ కు కెసిఆర్ సాయం చేశారని ఆరోపించారు. తనకు అధ్యక్ష పదవి శాశ్వతం కాదని… ఈ నిమిషం నడ్డా ఫోన్ చేసి పక్కకు తప్పుకోమంటే తప్పకుంటానని బండి సంజయ్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని… బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, కాంగ్రెస్ ను నడిపించేది కేసీఆరేనని అన్నారు. అట్లాంటప్పడు కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయమని చెబుతున్న నేతలు కాంగ్రెస్ లో ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ను ఓడించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో విలువ లేదని కేటీఆరే చెబుతున్నారని.. ఆత్మాభిమానమున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని సూచించారు. తెలంగాణపై జరిగిన ఓటింగ్ కు రాకుండా తాగి పడుకున్నాడని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news