రేపు పట్నాలో విపక్షాల సమావేశం.. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ దూరం

-

బిహార్ రాజధాని పట్నాలో రేపు విపక్షాలు సమావేశం జరగనున్నాయి. సీఎం నితీశ్ కుమార్ ఆహ్వానం మేరకు విపక్షాలు రానున్నాయి. పట్నాలోని నీతీశ్‌ కుమార్‌ ఇంట్లో విపక్షాల సమావేశం కానున్నాయి. ఈ భేటీలో రాహుల్‌ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌, శరద్ పవార్‌ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి టీడీపీ, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ దూరంగా ఉన్నాయి. బీజేపీని ఐక్యంగా ఎదుర్కొనే వ్యూహంపై ఈ భేటీలో నేతలు చర్చించనున్నారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మణిపుర్‌లో హింస, దిల్లీ ఆర్డినెన్సు అంశాలపై విపక్ష నేతలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కొనే వ్యూహరచనకు రేపు విపక్షాల తొలి అడుగు పడనుంది. కూటమికి నేతృత్వం వహించేదెవరు? ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రతిపాదిస్తారు? రకరకాల పరిమితులున్న పార్టీలన్నింటి మధ్య ఐక్యత సాధించడం సాధ్యమేనా?… వంటి అనేక ప్రశ్నలు రాజకీయవర్గాల్లో ఉన్న తరుణంలో పట్నాలో విపక్షాలు భేటీ కానుండటం చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news