జ‌గ‌న్ రెడ్డి సైకో అయితే…పోలీసులు నరరూప రాక్షసులు – నారా లోకేష్‌

-

జ‌గ‌న్ రెడ్డిలోని సైకో మ‌న‌స్త‌త్వాన్ని సంతృప్తి ప‌ర‌చ‌డానికి పోలీసులు న‌ర‌రూప రాక్ష‌సుల్లా మారారని నారా లోకేష్‌ నిప్పులు చెరిగారు. అబ్దుల్ స‌లాంని చేయ‌ని నేరంలో ఇరికించి, హింసించి కుటుంబాన్ని బ‌లి తీసుకున్న నంద్యాల వ‌న్ టౌన్ పోలీసులు..ఏ పాపం ఎరుగ‌ని ద‌ళిత యువ‌కుడిని క‌ర్క‌శంగా చంపేశారని మండిపడ్డారు. సీఎం జ‌గ‌న్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం, ఇంటి ప‌క్క‌నే ద‌ళితుల్ని అంత‌మొందిస్తుంటే చ‌ర్య‌ల్లేవు.

ద‌ళిత డ్రైవ‌ర్‌ని చంపి డెడ్ బాడీ డోర్ డెలివ‌రీ చేసిన ఎమ్మెల్సీకి వైసీపీ పాలాభిషేకం చేయ‌డం చూసి పోలీసులు కూడా ద‌ళితుల్ని చంపితే త‌మ‌కి ముఖ్య‌మంత్రి స‌న్మానాలు చేస్తార‌నే పిచ్చిలో ఉన్న‌ట్టున్నారని చురకలు అంటించారు నారా లోకేష్‌. నంద్యాల వ‌న్ టౌన్‌ ఎస్ఐ సుబ్బరామిరెడ్డి, కానిస్టేబుళ్లు నాగన్న ,ఏసుదాసు తాను చేయ‌ని నేరం ఒప్పుకోమ‌ని హింసించార‌ని సెల్ఫీ వీడియోలో వాంగ్మూలం ఇచ్చి మ‌రీ చిన్న బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడన్నారు. సైకో పాల‌న‌లో ఏ నేరం చేయ‌కపోయినా డాక్ట‌ర్ సుధాక‌ర్, ఓం ప్ర‌తాప్, కిర‌ణ్ కుమార్, ఇప్పుడు చిన్నాని బ‌లిగొన్నారు. అధికారం ఉంద‌నే అహంకారంతో ద‌ళిత‌జ‌నుల గుండెల‌పై దండ‌యాత్ర చేస్తున్న సైకో జ‌గ‌న్ రెడ్డి మ‌దం దింపుదాం. క‌లిసి రండి. ద‌ళితుల‌పై ద‌మ‌న‌కాండ సాగిస్తున్న సైకో పాల‌న అంత‌మొందిద్దామని పిలుపునిచ్చారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news