ఈ రోజు తెలంగాణలోని హైదరాబాద్ లో డ్రగ్స్ నివారణ పట్ల అవగాహన సదస్సును నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ సహనటుడు ప్రియదర్శితో కలిసి అతిధిగా వెళ్ళాడు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ మానవ ప్రాణాలను హరించే డ్రగ్స్ కు దూరంగా ఉండాలని చెప్పాడు. డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితం సర్వనాశనం అవుతుందని తెలియచేశాడు. స్వయంగా నిఖిల్ వ్యకిగత అనుభవం గురించి కూడా ఇక్కడ చెప్పడం కొసమెరుపు. ఇక చివరగా నిఖిల్ మాట్లాడుతూ మీరందరూ డ్రగ్స్ కు దూరంగా ఉండి, డ్రగ్స్ అలవాటు అయినవారి చేత కూడా మాన్పించి తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని కోరుకున్నారు. నిఖిల్ చెప్పిన ప్రకారం మొదట్లో ఇతనికి కూడా డ్రగ్స్ ను తీసుకోవాలని పలుమార్లు ఆఫర్స్ వచ్చాయట.
కానీ అందుకు నిఖిల్ ఒప్పుకోకపోవడంతో చాలా సమస్యల నుండి బయటపడినట్లు చెప్పుకొచ్చాడు. అందుకే చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు.