ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారి ఆటలు ఇకమీదట సాగేట్టు లేవు. ఈ క్రమంలోనే రాంగ్ రూట్ లో వెళ్ళేవారి తాట తీసేందుకు సిద్దం అయ్యారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. రాంగ్ రూట్ లో రావడం వల్ల డేంజర్ అని, అది మీకు మాత్రమే కాకుండా ఇతర వాహనదరులకి కూడా హాని కలిగిస్తుందని అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్తే కేసు నమోదు చేయడమే కాదు జరిమానా కూడా విధిస్తున్నారు. అలాగే రోజు 400మంది రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించారు.
రాంగ్‌రూట్‌లో ప్రయాణించినందుకు గాను వారిపై కేసు నమోదు చేసి వెయ్యి రుపాయలను జరిమానా కూడా విధిస్తున్నారు. ఈ నిఘా అక్టోబర్ ఒకటి నుండే మొదలయ్యాయి. ఎక్కువగా రాంగ్ రూట్స్ జరుగుతున్న ప్రదేశాల్లో సైబరాబాద్ పోలీసులు 20 ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మాదాపూర్ ఎన్‌ఐఏ బిల్డింగ్, గచ్చిబౌలీ జంక్షన్, మియాపూర్ నుంచి బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో 20 రాంగ్ రూట్ హాట్ స్పాట్లు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల జరిగే ప్రమాదాలను మనం నివారించవచ్చునని అంటున్నారు.