ఐపీఎల్ ఆడడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో క్రికెటర్ లు కోట్ల డబ్బును సంపాదించుకుంటున్నారు. కానీ ఈ ఐపీఎల్ వలన కొన్ని దేశాల క్రికెటర్లు దేశం తరపున ఆడకుండా డుమ్మా కొడుతున్నారు. వీరిపై ఎప్పటి నుండో విమర్శలు వస్తుండడం మనము చూస్తూ ఉన్నాం. కానీ తాజాగా వీరికి మద్దతుగా ఒక దిగ్గజ క్రికెటర్ ముందుకు వచ్చారు. వెస్ట్ ఇండీస్ కు చెందిన దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ ఇలాంటి క్రికెటర్స్ కు మద్దతుగా మాట్లాడాడు. లాయిడ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ లీగ్స్ జరిగినా ఆడుతూ మిలియన్ల సంపాదిస్తున్నారు రోనాల్డో మరియు మెస్సీ లాంటి ఫుట్ బాల్ ప్లేయర్లు. అటువంటిది క్రికెటర్లు ఐపీఎల్ లాంటి క్యాష్ రిచ్ లీగ్ లు ఆడుకుని డబ్బు సంపాదిస్తే తప్పేంటని ప్రశ్నించారు.
ఐసీసీ టోర్నమెంట్ లలో క్రికెటర్లు ఎవరైనా ఫెయిల్ అయితే ఐపీఎల్ ను ముడిపెట్టి విమర్శించడం సరికాదని వారికి కౌంటర్ ఇచ్చాడు.