రైతులకు శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. యూరియా సబ్సిడీ కింద మూడేళ్లలో రూ.3,68,676.70 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. తాజాగా PM మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 2025 వరకు సబ్సిడీపై యూరియా దక్కనుంది.
45 కేజీల బస్తా వాస్తవ ధర రూ. 2,200 ఉండగా… ప్రభుత్వం రూ. 242 కే అందిస్తుందని కేంద్ర మంత్రులు తెలిపారు. సేంద్రియ ఎరువుల తయారీకి రూ. 1,451 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవియా మాట్లాడుతూ… పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన మొత్తం రూ.3.70 లక్షల కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.