కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ దాదాపు ఖరారు చేసేసింది. జులై 17 నుంచి ఆగస్టు 10 వరకు వర్షాకాల సమావేశాలు జరిపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్లమెంట్ భవనంలోనే మాన్సూన్ సెషన్ జరగనుంది.
అయితే తేదీ ఖరారుపై మరికొద్ది రోజుల్లో పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఇందులో సమావేశాల తేదీపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల ఏడాదిలో జరుగుతున్న ఈ వర్షాకాల సమావేశాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్, ఢిల్లీ పరిపాలనాధికారాల బిల్లుతోపాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. మరోవైపు అదానీ-హిండెన్ బర్గ్ నివేదికపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.