నేడు సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గిరిజనులకు పోడు భూముల పట్టాలను విడుదల చేశారు సీఎం కేసీఆర్. నాలుగు లక్షల ఆరువేల ఎకరాల పట్టాలు లక్షన్నర మంది గిరిజనులకు పంపిణీ చేశారు. పోడు భూములకు రైతుబంధు నిధులు కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా 1,51,000 మంది రైతులకు 4.06 లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
గతంలో అడువులను ఆక్రమించారని కొంతమంది గిరిజనులపై కేసులు నమోదయ్యాయని.. వారిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని నిర్ణయించామన్నారు. పోడు భూములకు ఇకపై 3 ఫెజ్ కరెంట్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరివికాసం కింద బోర్లు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.