గత కొన్ని రోజుల నుండి మణిపూర్ రాష్ట్రంలో ఒక చట్టం గురించిన వివాదం వలన ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు రావడంతో రాష్ట్రము అంతటా హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు అంతా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయారు. ప్రస్తుతానికి అయితే పరిస్థితి ఏమంత భయంకరంగా లేకపోయినప్పటికీ కొన్ని చోట్ల హింస చెలరేగుతోంది. కాగా ఈ హింసాత్మక ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తపై వివరణ ఇవ్వడానికి సీఎం బీరెన్ సింగ్ స్వయంగా వచ్చారు.. ఈయన అధికారికంగా నేను సీఎంగా రాజీనామా చేయడం లేదని ప్రకటించారు.
ఇప్పుడు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేడనై తేల్చి చెప్పారు. ఇక ఈ విషయం తెలిసిన మణిపూర్ ప్రజలు పెద్ద సంఖ్యలో సీఎం ఇంటి వద్దకు చేరుకొని రాజీనామా చేయొద్దంటూ కోరుకుంన్నారు.