కాసేపటి క్రితమే భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన గెలిస్తే ఏమి చేస్తాము అన్న విషయాలను సవివరంగా ప్రజలకు తెలియచేశాడు. ఈ మీటింగ్ లో పవన్ మాట్లాడుతూ జనసేనను మీరు అధికారంలోకి వచ్చేలా చేస్తే వెనుకబడిన కులాలను పారిశ్రామికవేత్తలుగా మార్చే బాధ్యత నాది అన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో 500 మంది యువతను సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తామని మాటిచ్చారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికీ దేశ సంపద అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అప్పటి వరకు ఉన్న అంబెడ్కర్ విదేశీ విద్య అన్న పేరును తీసేసి సీఎం జగన్ తన పేరు వచ్చేలా మార్పులు చేసుకున్నాడన్నారు. పథకాలకు పేర్లు మార్చుకొవడం కాదు… ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు జగన్ ఏమి చేశాడో చెప్పాలని సభాముఖంగా డిమాండ్ చేశాడు.
ఈ పాయింట్ ను బాగా ఆలోచిస్తే యువత కనెక్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటికీ చాలా మంది యువత ఎన్నో మంచి ఆలోచనలు ఉన్నా ఆర్ధికంగా శక్తి లేక ఆగిపోతున్నారు.