ఆప‌రేష‌న్ వ‌శిష్ట‌: ఆప‌రేష‌న్ సక్సెస్‌.. పేషెంట్ డెడ్‌

-

ఆప‌రేష‌న్ సక్సెస్‌.. బ‌ట్ పేషెంట్ డెడ్‌.. అన్న చందంగా మారింది.. ఆప‌రేష‌న్ వశిష్ట బోటు వ్య‌వ‌హారం. ధ‌ర్మాడి స‌త్యం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ వ‌శిష్ట రెండు అడుగులు ముందుకు మూడు అడుగులు వెన‌క్కి అన్న‌ట్లుగా ఉంది ప‌రిస్థితి.. పొద్దంతా క‌ష్ట‌ప‌డి బోటు జాడ తెలుసుకుని, దాన్ని బ‌య‌టికి తీసే క్ర‌మంలో అది మ‌ళ్ళీ జారిపోవ‌డంతో ధ‌ర్మాడి స‌త్యం ప‌డిన శ్ర‌మ‌కు గంగ‌పాలు అవుతుంది. తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దగ్గర గోదావరి నదిలో మునిగిపోయిన బోటు వెలికితీత ఆపరేషన్ మరోసారి విఫలమైంది.. ఆపరేషన్ రాయల్ వశిష్టలో భాగంగా లంగర్లు వేసి బోటును బయటకు తీసే ప్రయత్నం చేయగా.. రోప్‌తో పాటు బోటు పై కప్పు మాత్రమే బయటకు వచ్చింది.

ఇంత‌కాలం బోటు మునిగిన జాడ తెలియ‌క స‌త‌మైన ధ‌ర్మాడి స‌త్యంకు నిన్న లంగ‌ర్‌కు బోటు త‌గ‌ల‌డం, బోటులోని ఓ శ‌వం త‌ల‌లేని మొండం బ‌య‌టికి రావ‌డంతో బోటు జాడ తెలిసింది. దీంతో ఈరోజు బోటు ఉన్న చోటునే గ‌జ ఈత‌గాళ్ళ‌ను ధ‌ర్మాడి స‌త్యం దించారు. గ‌జ ఈతగాళ్ళు ముందు నీటిలోకి మునిగి బోటుకు లంగరు వేశారు. బోటు పై భాగానికి లంగ‌ర్‌ను త‌గిలించి పైకి లాగారు. అయితే బోటు నెల రోజుల‌కు పైగా నీటిలో నాన‌డం, బోటు బరువు ఎక్కువగా ఉండడంతో బరువు తట్టుకోలేక రోప్‌తో పాటు బోటు పై కప్పు ఊడివచ్చింది. దీంతో ఆప‌రేష‌న్ ఈరోజుకు పాక్షికంగానే జ‌రిగింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఏదేమైనా ఆపరేషన్‌లో కొంత పురోగతి సాధించినప్ప‌టికి మ‌రో ఒక‌టో రెండో రోజుల్లో ఆప‌రేష‌న్ స‌క్సెస్ కావ‌డం ఖ‌య‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే.. రోజుకో భాగం చొప్పున బయటకు వస్తుండడంతో ఏదో ఒక రోజు బోటు మొత్తం బయటకు రావ‌డం ఖాయ‌మే.. ఇక బోటు జాడ తెలిసింది.. దీనికి తోడు ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం రోజు రోజుకు త‌గ్గుతుంది. అందుకే నీటి మ‌ట్టం స్థాయి త‌గ్గుతుండ‌టం వెలికితీతకు అనుకూలంగా మారింది.. గోదావ‌రి న‌ది వరుసగా ఐదోరోజు నీటిమట్టం తగ్గడంతో బోటు ఎలాగైనా బ‌య‌టికి తీయ‌డంకు అనుకూలించే విషయంగానే చెప్ప‌వ‌చ్చు.

బోటు పైకి రాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా బోటు గోదావరిలో ఏటవాలుగా మునిగిందని అధికారులు చెబుతున్నారు.. మునిగిపోయిన బోటు ముందు భాగంగా గోదావరిలో 40 అడుగుల లోతులో, వెనక భాగం 70 అడుగుల లోతులో ఉందనే అంచనాకు వచ్చారు అధికారులు. అయితే బోటు కూడా చాలా రోజులుగా నీటిలో నానుతున్నందున అంతా శిథిల‌మై ఉంటుంద‌ని, దీనికి తోడు బోటుకు పై భాగంలో లంగ‌ర్ త‌గిలించ‌డంతో అది బాగా బ‌రువై పైకి రాలేక పోయిందని, అదే లంగ‌ర్‌ను బోటుకు కింది భాగంలో అయితే త‌ప్ప‌కుండా పైకి వ‌చ్చేద‌నే అభిప్రాయానికి వ‌చ్చారు అధికారులు, ధ‌ర్మాడి స‌త్యం బృందం.

Read more RELATED
Recommended to you

Latest news