మ‌రో వివాదంలో R R R సినిమా… చిక్కుల్లో రాజ‌మౌళి

-

ఇటీవల తెలుగు సినిమాలు వరుసగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. భారీ బడ్జెట్ సినిమాల నుంచి పెద్ద హీరోల సినిమాలతో పాటు.. మీడియం రేంజ్‌ హీరోల సినిమాల వరకు ఇబ్బందులు తప్పడంలేదు. బాహుబలి, సాహో, సైరా నుంచి గద్ద‌లకొండ గణేష్ వరకు ప్రతి సినిమాను ఏదో ఒక వివాదం చుట్టుముడుతుంది. ఇప్పుడు ఈ వివాదంలోకి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చి చేరింది. ఈ వివాదాలు మ‌రీ చిత్రంగా ఉంటున్నాయి.

కొద్దిరోజుల క్రితమే మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా కాస్త రిలీజ్‌కు ఆరు గంటల ముందే గద్ద‌లకొండ గణేష్ గా టైటిల్ మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాపై అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్రలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఎక్కడ కలిసి పని చేసినట్టు లేదని… అలాంటిది ఇప్పుడు రాజమౌళి వీరిద్దరూ కలిసి పోరాటం చేసినట్టు చూపిస్తుండటం చరిత్రను వక్రీకరించడ‌మే అని … అది చాలా తప్పు అని ఆయన నర్సీపట్నం ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు.

అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం జిల్లాలోని పాండ్రంకిలో పుట్టి.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న బ్రిటీషు సైనికుల కాల్పుల్లో వీరమరణం పొందారు. ఇక కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోంది. వీరిద్ద‌రు క‌లిసిన‌ట్టు లేని చ‌రిత్ర‌ను క‌ల్పితంగా మార్చ‌డం స‌రికాద‌ని కూడా ఆయ‌న విన‌తిప‌త్రంలో పేర్కొన్నారు.

ఈ వివాదం ఎలా ఉన్నా రాజ‌మౌళి మాత్రం ఈ విష‌యంలో గ‌తంలోనే క్లారిటీ ఇచ్చారు. 1920లో అల్లూరి, కొమురం భీం క‌లిసిన‌ట్టు లేద‌ని… కాని వారు క‌లిసి ఉంటే ఎలా ఉంటుందో ? కథ త‌యారు చేశాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి ఇది ముందే ఫిక్ష‌న్ అని చెప్పినా దీనిపై ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ వ‌స్తుండ‌డంతో సినిమా ముగిసేలోగా రాజమౌళి ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news