తమిళ్ హీరో ధనుష్ తెలుగు లో తన నటన మరియు స్టైల్ తో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. అందుకే ధనుష్ సినిమా ఏదైనా తమిళ్ లో విడుదల అయితే… తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు మేకర్స్. అలాంటి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు ఊహించని షాక్ తగులనుంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు తమిళ నిర్మాతల మండలి సిద్ధమైనట్లు సమాచారం. గతంలో శ్రీ తెండ్రల్ ఫిలిమ్స్ నిర్మాణంలో సినిమా చేస్తానని మాట ఇచ్చి అడ్వాన్స్ తీసుకున్నారు. చాలా ఏళ్లవుతున్న ఆ సినిమా చేయట్లేదు. దీంతో సదరు నిర్మాతలు… నిర్మాతల మండలిని ఆశ్రయించడంతో నోటీసులు ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ధనుష్ నుంచి సరైన సమాధానం రాకపోతే బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నాయి.