ఈ టిప్స్‌ పాటిస్తే మీకు ఏ ఫౌండేషన్ సెట్‌ అవుతుందో ఈజీగా తెలుసుకోవచ్చు

-

బేసిక్‌ మేకప్‌లో భాగంగా చాలామంది వాడేది ఫౌండేషన్‌. ముఖానికి ఫౌండేషన్‌ అప్లై చేసి లిప్‌స్టిక్‌ పెట్టి, ఐలైనర్ వేసుకుంటే చాలు రెడీ అవడం పూర్తి అయిపోతుంది. చాలా మంది ఎక్కువగా ఈ నాలుగే ఫాలో అవుతుంటారు. అయితే ఫౌండేషన్‌ అనేది మీ చర్మ రంగుకు సరిపోయేది ఎంచుకుంటే మీ లుక్‌ ఇంకా బాగుంటుంది, అందంగా ఉంటారు. మీకు నప్పని ప్రొడక్ట్ ఎంత ఖరీదైంది వాడినా ప్రయోజనం ఉండదు. అందుకే ఆన్‌లైన్ లో ఫౌండేషన్ కొనేటపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

చర్మం రకం తెలుసుకోండి:

చర్మం రకానికి తగ్గట్లు ఫౌండేషన్ ఎంచుకోవాలి. ఉదాహరణకు మీ టీ జోన్.. అంటే నుదురు, ముక్కు దగ్గర ఎప్పుడూ జిడ్డుగా అనిపిస్తే మీకు మ్యాటె ఫినిషింగ్ ఉన్న, వాటర్ బేస్డ్ ఫౌండేషన్ నప్పుతుంది. పొడి చర్మం ఉంటే హైడ్రేటింగ్, ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్లు సరిపోతాయి.

స్కిన్ టోన్:

చర్మం రంగు మీద సరైన అవగాహన లేకుండా మీకు నప్పే ఫౌండేషన్ షేడ్ ఎంచుకోవడం కష్టమే. దానికోసం ఆన్‌లైన్‌లో కొన్ని సైట్లలో ఫౌండేషన్ మ్యాచింగ్ టూల్స్ ఉంటాయి. లేదా కొన్ని వెబ్‌సైట్లలో వర్చువల్ మేకప్ ట్రయల్ ఆప్షన్ ఉంటుంది. వీటి సాయంతో మీకు నప్పే షేడ్ సులభంగా ఎంచుకోవచ్చు. మీకు సరిపోయే షేడ్ లేకపోతే రెండు షేడ్లను తీసుకుని వాటిని కలిపి వాడొచ్చు.

శ్యాంపిళ్లు:

ఇపుడు చాలా బ్రాండ్స్ మినీ లేదా ట్రయల్ శ్యాంపిల్స్ అందుబాటులోకి తెచ్చాయి. మీకు నప్పే ఫౌండేషన్ గురించి సందేహం ఉంటే ముందు ఈ మినీ ప్యాక్ కొనుక్కుని, అది నప్పితే తరువాత పెద్ద ప్రొడక్ట్ కొనుగోలు చేసుకోవడం ఉత్తమం.

రివ్యూలు:

మీరు కొనాలనుకునే ఫౌండేషన్ రివ్యూలు యూట్యూబ్‌లో, గూగుల్‌లో బోలెడుంటాయి. ఆ వీడియోలు చూస్తే మీకు నప్పుతుందో లేదో మీరే తెలుసుకోవచ్చు. మీకున్న సందేహాలు వాటివల్ల చాలానే తీరిపోతాయి. లేదా ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో ఉండే రివ్యూలు కూడా మీకు సాయపడొచ్చు.

కవరేజీ:

ఫౌండేషన్లలో వివిధ కవరేజీ రకాలుంటాయి. మన చర్మం మీదున్న మచ్చలు, మృదుత్వం బట్టి వీటిని ఎంచుకోవాలి. ఫుల్ కవరేజీ, మీడియం కవరేజీ, లైట్ వెయిట్ కవరేజీ అని రకాలు ఉంటాయి. ముఖం మీద మచ్చలు, మొటిమల తాలూకు ఎర్రటి దద్దుర్లు, నల్లటి మచ్చలు, గుంతలు.. ఇలాంటి సమస్యలు ఎక్కువుంటే ఫుల్ కవరేజీ ఫౌండేషన్ ఎంచుకోవచ్చు. చర్మం నున్నగా, ఎలాంటి మచ్చలూ లేకుండా కేవలం మంచి ఫినిషింగ్ కోసం మాత్రమే ఫౌండేషన్ కాావాలి అనుకుంటే లైట్ కవరేజీ ఫౌండేషన్ ఎంచుకోవాలి. ఈ జాగ్రత్తల వల్ల మేకప్ మంచి లుక్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news