ఈటల రాజేందర్ కు పదవిపై ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. బండి సంజయ్ మార్పుతో తెలంగాణ బీజేపీలో కంటిన్యూ గందరగోళం అవుతోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కొత్తగా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది బీజేపీ అధిష్టానం. ఇంత వరకు కొత్త పదవి అయిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పై స్పందించలేదు కిషన్‌రెడ్డి. అటు అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడంపై అసంతృప్తితోనే బండి సంజయ్ ఉన్నారని సమాచారం అందుతోంది.
కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు ఇష్టపడని బండి సంజయ్.. సామాన్య కార్యకర్తగా ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. ఇక అటు ఈటల రాజేందర్ కు పదవిపై మరికొందరు బీజేపీ నేతల అసంతృప్తి గా ఉన్నారు. ఈటల రాజేందర్ కు పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంత వరకు పెదవి విప్పలేదు. ఇక ఇటీవలే ఈటల రాజేందర్ తో కలిసి ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలకు కలిసారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు సమస్య తీర్చిందా? కొత్త సమస్య తెచ్చిందా? అనే అంశం తెరపైకి వచ్చింది. మొత్తానికి ఈటల రాజేందర్ వల్లే ఈ పరిస్థితి ఎదురైందని కొంత మంది తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు.