ష‌కీలాను ఆ వ్య‌సనంలో ముంచింది ఆ స్టార్ హీరోయినే..

-

మలయాళ శృంగార చిత్రాలతో ఒకప్పుడు కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది షకీలా. 1998-2002 మ‌ధ్య కాలంలో ఆమె శృంగార సినిమాలు తెలుగు తెర‌పై దండ‌యాత్ర చేశాయి. మ‌ళ‌యాళంలో ఆమె సినిమాల దెబ్బ‌తో పెద్ద హీరోల సినిమాలు క‌లెక్ష‌న్లు ప‌డిపోవ‌డంతో పెద్ద హీరోలంద‌రు అప్ప‌ట్లో ఆమె సినిమాల‌ను బ్యాన్ చేయాల‌న్న కండీష‌న్లు కూడా పెట్టాయి. ఆ త‌ర్వాత ఆ సినిమాలు తెలుగు, కన్న‌డ, త‌మిళ భాష‌ల్లోకి కూడా రిలీజ్ అయ్యి సంచ‌ల‌నం రేపాయి. అలా ఆ టైంలో ఆమె రేపిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు.

ఆ త‌ర్వాత ఆమె తెలుగులో జ‌యంతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో క్యారెక్ట‌ర్ రోల్స్ కూడా చేసింది. ఇప్పుడు సినిమాల‌కు దూరంగా ఉంటున్నా అడ‌పా ద‌డ‌పా ఛాన్సులు వ‌స్తే ఫ్రూవ్ చేసుకోవాల‌నుకుంటోంది. ఇక తాజాగా ఆమె త‌న సినిమా జీవితంలో జ‌రిగిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటోంది. ఈ క్ర‌మంలోనే త‌న‌కు సిగ‌రెట్ తాగే అల‌వాటు ఎందుకు వ‌చ్చిందో ? ఈ అల‌వాటు నేర్పిన హీరోయిన్ ఎవ‌రో ఆమె బ‌య‌ట పెట్టింది.

Actress Shakeela Latest Photos @ Dyavuda Audio Launch

ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ – ప్రస్తుత నిర్మాత పూజా భట్ షకీలాకు సిగరెట్ అలవాటు చేసిందట. ఇది నిజం అట‌. ఓ సారి ష‌కీలా చెన్నైకు వెళ్లింద‌ట‌. అక్క‌డ ఆమె పూజాను క‌ల‌వ‌డంతో ఆమె సిగ‌రెట్ తాగుతోంద‌ట‌. పూజ సిగ‌రెట్ తాగుతున్న స్టైల్ ష‌కీలాకు చాలా బాగా న‌చ్చింద‌ట‌. అప్పుడు పూజ సిగ‌రెట్ ఎలా తాగాలో నేర్పించ‌డంతో ష‌కీలా సిగ‌రెట్ తాగింద‌ట‌. ఇక అప్ప‌టి నుంచి ఆమెకు సిగ‌రెట్ అల‌వాటు అయ్యి చివ‌ర‌కు అది పెద్ద వ్య‌స‌నంగా మారింద‌ట‌.

ఇక ఇప్ప‌ట‌కీ కూడా తాను సిగ‌రెట్ అల‌వాటు మాన‌లేకపోతున్నాన‌ని ష‌కీలా చెప్పింది. ఇక తాను గ‌తంలో కొంత‌మందిని ఇష్ట‌ప‌డ్డాన‌ని…. తన బాయ్ ఫ్రెండ్స్ తనను హింసించారని.. పెళ్లి కాకుండానే ఇలా చేస్తే పెళ్లయితే ఇంకెలా ఉంటారో అని ఎవరితోనూ పెళ్లి వైపు అడుగులు వేయలేదని షకీలా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news