ఐఫోన్ XR ఇక‌పై మేడిన్ ఇండియా ఫోన్‌.. భారీగా త‌గ్గిన ధ‌ర‌..!

-

ఐఫోన్ XR ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్న వినియోగ‌దారుల‌కు ఆపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ XR ఫోన్‌ను ఇప్పుడు భార‌త్‌లోనే త‌యారు చేస్తున్నందున ఇక‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌కే ఈ ఫోన్‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తున్న‌ట్లు తెలిపింది.

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ తన ఐఫోన్ల‌ను భార‌త్‌లో విక్ర‌యించేందుకు ఇక్క‌డికి ఆ ఫోన్ల‌ను దిగుమ‌తి చేస్తుంద‌నే విష‌యం తెలిసిందే. కేవ‌లం ఐఫోన్ ఎస్ఈ ఫోన్‌ను మాత్ర‌మే మ‌న దేశంలో ఆ కంపెనీ త‌యారు చేస్తోంది. దీంతో ఆ ఫోన్ చాలా త‌క్కువ ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది. ఇక ఇక్క‌డికి దిగుమ‌తి అయ్యే ఫోన్ల‌పై 18 శాతం సుంకం చెల్లించాల్సి వ‌స్తుండ‌డంతో మిగిలిన ఐఫోన్ల ధ‌ర‌లు ఇత‌ర దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో కొంచెం ఎక్కువ‌గానే ఉంటున్నాయి. అయితే ఇక‌పై ఐఫోన్ XR ఫోన్ ధ‌ర మాత్రం త‌గ్గ‌నుంది. ఎందుకంటే ఈ ఫోన్‌ను ఆపిల్ ఇప్పుడు మ‌న దేశంలోనే త‌యారు చేస్తోంది.

Now iphone xr is made in india phone available at reduced prices

ఐఫోన్ XR ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్న వినియోగ‌దారుల‌కు ఆపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ XR ఫోన్‌ను ఇప్పుడు భార‌త్‌లోనే త‌యారు చేస్తున్నందున ఇక‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌కే ఈ ఫోన్‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తున్న‌ట్లు తెలిపింది. భార‌త్‌లో త‌యార‌య్యే ఫోన్ల‌పై సుంకం ఉండదు క‌నుక ఐఫోన్ XR ఫోన్ పై 18 శాతం సుంకం చెల్లించాల్సిన ప‌నిలేదు. దీంతో ఆ మేర ఆ ఫోన్ ధ‌ర త‌గ్గుతుంది. ఇక ఇప్పుడు త‌గ్గించిన ధ‌ర‌ల‌కే ఈ ఫోన్‌ను మార్కెట్‌లో విక్ర‌యిస్తున్నారు.

ఐఫోన్ XR ఫోన్ కు చెందిన 64జీబీ వేరియెంట్ ధ‌ర ప్ర‌స్తుతం ఆఫ్‌లైన్‌ మార్కెట్‌లో రూ.49,900 ఉండ‌గా, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌లో దీపావ‌ళి స్పెష‌ల్‌ సేల్స్‌ సంద‌ర్భంగా ఈ వేరియెంట్‌ను రూ.44,900 కే విక్ర‌యిస్తున్నారు. కాగా ఇప్ప‌టికే మేడిన్ ఇండియా ట్యాగ్‌ల‌తో ఐఫోన్ XR ఫోన్లు వినియోగ‌దారుల‌కు మార్కెట్‌లో ల‌భిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ ఫోన్ల‌ను కొనుగోలు చేసేందుకు క‌స్ట‌మ‌ర్లు కూడా ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news