యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఈయనకు ఐరా క్రియేషన్స్ అనే ఒక నిర్మాణ సంస్థ ఉన్న విషయం తెలిసిందే. తన తండ్రి శంకర్ ప్రసాద్ సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై తన తల్లి ఉషా మల్పూరి నిర్మాతగా సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక ఈ బ్యానర్ లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు రాగా వాటిలో మొదటి సినిమా ఛలో మాత్రమే మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక మిగిలిన మూడు చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించలేదు. అంతేకాదు ఈ నాలుగు సినిమాలలో కూడా నాగశౌర్యనే హీరోగా నటించడం గమనార్హం.
ఇకపోతే తాజాగా ఆయన నటించిన చిత్రం రంగబలి ..ఈనెల ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ద్వారా పవన్ బాసం శెట్టి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే నాగశౌర్య మాట్లాడుతూ.. తన ఫ్యామిలీకి సినిమా అంటే పిచ్చి అని.. ఆ ఇష్టంతోనే సినిమాలు తీస్తున్నామని.. అయితే డబ్బులు సంపాదించడానికి సినిమా ఇండస్ట్రీలోకి రాలేదని నాగశౌర్య వెల్లడించారు.
రంగబలి సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా చూసిన తర్వాత వచ్చిన నమ్మకంతోనే కాన్ఫిడెంట్ గా ఉన్నానని రంగ బలి సినిమా మంచి విజయం అందుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేను వచ్చిందే ప్రేక్షకులను మెప్పించడానికి .. ఇక్కడ పోటీలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించాల్సిందే నటిస్తున్నారు కూడా డాన్సులు చేస్తున్నారు.. ఫైట్ లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మనము కూడా ది బెస్ట్ ఇవ్వాలి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి గాయాలు అవుతాయి కానీ కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అంటూ ఆయన తెలిపారు.