ఏపీ, తెలంగాణ ప్రజలు..రెడ్లనే ఎమ్మెల్యేలు, ఎంపీలు చేయాలనుకుంటున్నారు !

-

కాకినాడ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు రెడ్లనే కోరుకుంటున్నారంటూ పేర్కొన్నారు. ప్రజలు రెడ్లనే ఎమ్మెల్యేలు, ఎంపీలు చేయాలి అనుకుంటున్నారన్నారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాగా,  ఈనాడు పత్రికలో ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడలో భూములు కబ్జా చేసినట్లుగా వార్తలు వచ్చాయని రాసినట్లుగా ద్వారంపూడి పేర్కొన్నారు.

ఈ వార్తలపై ద్వారంపూడి స్పందించారు… రామోజీరావు నాపై రాయించిన ఈ విషపు రాతలు ఏమాత్రం వాస్తవం కాదన్నారు. రామోజీరావుకు కేవలం తమ కులం వారు తప్ప మిగతా ఎవరు అధికారంలో ఉన్న నచ్చడం లేదు. వారిపై ఏదో ఒక అసత్య వార్తలను తన చానెళ్లు పేపర్ లు ద్వారాల ప్రచారం చేయిస్తూ ఉంటారంటూ కామెంట్ చేశాడు. ఈ వార్తలను నిజం అని నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటాను అంటూ రామోజీరావుకు ద్వారంపూడి సవాలు విసిరాడు. ఇక్కడకి ఎవరైనా వచ్చి విచారణ చేయించుకోవచ్చని చెప్పాడు. ఇంకోసారి ఇటువంటి వార్తలు రాయడం కరెక్ట్ కాదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news