వచ్చే ఎన్నికలలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలలో ఏ పార్టీతోనూ వైసీపీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. గెలవలేమనే భయమున్న పార్టీలకే పొత్తులు అవసరమని అన్నారు. రానున్న ఎన్నికలలో అభివృద్దే వైసీపీ నినాదం అని అన్నారు బొత్స. పెరిగిన విద్యుత్ చార్జీల పేరుతో కంపెనీలు బ్లాక్ మెయిల్ కి దిగుతున్నాయన్నారు.
ఇది సరికాదని సూచించారు మంత్రి. వ్యాపారాలు అన్న తర్వాత లాభనష్టాలు రెండు ఉంటాయని.. లాభాలు వచ్చినప్పుడు కంపెనీలు ప్రభుత్వానికి ఏమైనా ఇచ్చాయా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని పొత్తులతో వచ్చినా రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.