భోళా శంకర్ నుంచి సెలబ్రేషన్ సాంగ్ ప్రోమో రిలీజ్

-

మెగాస్టార్ చిరంజీవి ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’గా పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌ జోష్‌లో చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి జాం జాం జాం జాం జజ్జనక… తెల్లార్లూ ఆడుదాం తయ్యితక్క అంటూ హుషారుగా సాగే ఓ సెలబ్రేషన్ సాంగ్ ప్రోమో రిలీజయింది. ఈ పాట పూర్తి లిరికల్ వీడియోను జులై 11న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది.

Promo of Bholaa Shankar's celebration song unveiled | 123telugu.com

భోళా శంకర్ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఇటీవల ఈ పాట మేకింగ్ వీడియోను చిత్రబృందం పంచుకుంది.
సినిమాలోని ప్రధాన తారాగణమంతా ఈ పాటలో స్టెప్పులేయడం ఆ వీడియోలో కనువిందు చేసింది.

ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారథ్యంలో ఈ మాస్ ఎంటర్టయినర్ తెరకెక్కుతోంది. ఇందులో
చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి చెల్లెల్లుగా కీలకపాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది.

సుశాంత్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్, మురళీశర్మ, బ్రహ్మాజీ, ఉత్తేజ్, శ్రీముఖి, గెటప్ శ్రీను, షావర్ అలీ, సితార, కాశీ విశ్వనాథ్, హైపర్ ఆది, వైవా హర్ష, వేణు, సత్య, తాగుబోతు రమేశ్, బిత్తిరి సత్తి ఈ చిత్రంలోని ఇతర తారాగణం.

Read more RELATED
Recommended to you

Latest news