వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగానికి వ్యతిరేకం – పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు

-

విజయవాడ: గురువారం పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. రేపు సాయంత్రానికి తాము చేపట్టబోయే ఆందోళనల నిర్వహణ వివరాలు తెలియజేస్తామన్నారు. గ్రామ వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను పంచాయితీలలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయ వ్యవస్ధ, వాలంటీర్ల వ్యవస్ధ రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నారు రాజేంద్రప్రసాద్.

గ్రామ సచివాలయాలకు, ఆ సెక్రెటరీలకు రాజ్యాంగ ప్రతిపత్తి లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఇవాళ కామెంట్ చేసారు‌.. మేం రెండు సంవత్సరాల క్రితమే చెప్పామన్నారు. రాజ్యాంగేతర శక్తులు వాలంటీర్లు ఎక్కడ నుంచీ ఎందుకు వచ్చారని అన్నారు. గ్రామ సచివాలయ కార్యదర్శుల సంతకాలకు విలువ లేదన్నారు. వాళ్ళు ఇచ్చే అనుమతిపత్రాలు చిత్తు కాగితాలని వ్యాఖ్యానించారు. పవన్ వాలంటీర్లు, సచివాలయాల విషయంలో కోర్టుకెళతా అన్నారని.. రాజకీయంగా ఓట్ల కోసం వాలంటీర్లను మెట్లుగా వాడుకుంటూ బలి పశువులను చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news