బ్రేకింగ్‌: రాజకీయాయ‌ ప్రత్యర్థులను చిత్తు చేసిన రెజ్లర్ బబితా ఫొగట్

-

ప్ర‌ముఖ రెజ్ల‌ర్ బ‌బితా ఫోగ‌ట్ 2014, 2018 కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలను సాధించి యావ‌త్ భార‌త ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను గెలుచుకున్నారు. తాజాగా ఆమె ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బబితా ఫొగట్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. హర్యాణాలోని చాఖ్రీ దాద్రి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె… ప్రత్యర్థులక కంటే ముందంజలో ఉన్నారు.

ప్ర‌త్య‌ర్థుల‌పై ఆమె భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కాసేపటి క్రితం కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమెకు… బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ప్రజలు తనను ఆశీర్వదించారని చెప్పారు. ప్రజలపై తనకు నమ్మకం ఉందని… వారి ప్రేమాభిమానాలే తనను ముందుకు సాగేలా చేస్తున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news