చంద్రబాబుకు చెమటలు పట్టాయి. ఎన్నో లెక్కలు.. అంచనాలు వేసుకున్న ఆయన ఇప్పుడు పూర్తిగా డైల మాలో పడిపోయారు. అంతేకాదు, మనుటయా? మరణించుటయా? అనే రేంజ్‌లో ఆయన, ఆయన పార్టీ ప రిస్తితి కూడా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం.. తాజాగా వెల్లడైన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలిత మే. ఇక్కడ నుంచి ఎన్నో ఆశలతో చంద్రబాబు తన సామాజిక వర్గానికే చెందిన మాజీ జెడ్పీటీసీ చావా కిరణ్మయి ని పోటీకి నిలబెట్టిన విషయం తెలిసిందే. ప్రచరం కోసం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అయితే, తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఘోరాతి ఘోరమైన ఓట్లను దక్కించుకుని రెండు సైకిల్ టైర్లను పంక్ఛర్ చేయించుకున్నారు బాబు. ఆ పార్టీ అభ్యర్థికి ఇక్కడ కేవలం 1800 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే 2014లో ఇక్కడ టీడీపీకి 25 వేల ఓట్లు దక్కగా ఇప్పుడు కేవలం 1800 ఓట్లు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్ నేనే కట్టా.. ట్యాంక్ బండ్ నేనే కట్టా, సైబరాబాద్ నేనే కట్టా.. అంటూ ప్రగల్భాలు పలికిన సమయంలోనే చంద్రబాబును ఇక్కడ ఎవరూ లెక్కపెట్టలేదు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఎవరు ఆయనను, ఆయన పార్టీని పరిగణనలోకి తీసుకుంటారు? అని అనుకున్న వారు ఉన్నారు.
అయితే, ఏపీ బోర్డర్‌కు అత్యంత సమీపంలో ఉన్న నియోజకవర్గం కావడం, టీడీపీకి గట్టి పట్టున్న కృష్ణాజిల్లాకు సమీపంలోని జిల్లా కావడంతో బాబు హవా ఎంతో కొంత ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, తాజాగా గురువారం వెల్లడైన హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ లాస్ట్‌కు పడిపోయింది. అధికార టీఆర్ ఎస్ ఇక్కడి సీటును కైవసం చేసుకుని విజయం సాధించి తొలి స్థానంలో నిలిస్తే.. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ, మూడో స్థానంలో హెల్మెట్ గుర్తున్న ఇండిపెండెంట్ సొంతం చేసుకున్నారు. ఇక, నాలుగో స్థానాన్ని బీజేపీ, ఐదో స్థానాన్ని మరో ఇండిపెండెంట్ పొందగా ఆరోస్థానంలో టీడీపీ నిలిచింది.
దీంతో ఆ పార్టీ పరువు ఘోరాతి ఘోరంగా పోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రతి రౌండ్‌కు వంద ఓట్లకు మించి రాలేదు. నిజానికి కమ్యూనిస్టుల ఓట్లు కూడా ఇంతగా దిగజారి పోలేదు. కానీ, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మాత్రం అత్యంత దయనీయమైన పరిస్తితికి చేరిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇక, పార్టీ జెండా పీకేయడమే బెస్ట్ అని అనేవారు కూడా కనిపిస్తుండడం గమనార్హం.