అమ్మఒడి లబ్ధిదారులకు అలర్ట్.. అమ్మఒడి కింద రూ.13,000 రావాలంటే ఆధార్ అనుసంధానం కచ్చితం అని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. గతేడాదే ఈ విధానం తీసుకొచ్చినా ఇప్పటికీ చాలామంది లింక్ చేసుకోలేదని తెలిపారు. తక్షణమే తల్లుల బ్యాంకు ఖాతాను NCPA పోర్టల్ లో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. కాగా, 2 వారాల క్రితం సీఎం జగన్ అమ్మఒడి డబ్బులు విడుదల చేశారు.
ఇది ఇలా ఉండగా, రేపు తిరుపతిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై సీఐ దాడి, అనుచిత వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. సదరు సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు పవన్ కళ్యాణ్.