మృతదేహాలను కాల్చకుండా ఇంట్లోనే భద్రంగా దాచుకుంటారట.. అదే అక్కడి సంప్రదాయం

-

చనిపోతే మనిషి మృతదేహం ఎందుకు పనికిరాదు.. ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంచుకోరు. ఒకవేళ దూరపు బంధువులు రావాలంటే.. ఐస్‌లో ఎలాగోలా ఒక వారం వరకూ స్టోర్‌ చేయొచ్చు. అంతకుమించి మనిషి మృతదేహాన్ని ఎవ్వరూ ఇంట్లో పెట్టుకోరు కదా..! కాల్చడమో, పూడ్చటమో ఏదో ఒకటి చేస్తారు. కానీ అక్కడ మాత్రం మనిషి చనిపోతే ఇంట్లోనే భద్రంగా దాచుకుంటారు. ఇండోనేషియాలోని ఒక గిరిజనును నివసించే ప్రాంతంలో విచిత్రమైన సంప్రదాయం ఉంది. అక్కడి కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని ఇంట్లో ఉంచి వారితో మాట్లాడటం ఒక ఆచారం. వినడానికి వింతగా ఉన్నప్పటికి ఈ పద్ధతి చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది.

ఇండోనేషియాలోని సులవేసిలో టోర్జా అనే ప్రదేశం ఉంది. అక్కడ నివసిస్తున్న గిరిజనులు తమ బంధువులు, కుటుంబ సభ్యుల మృతదేహాన్ని ఇంట్లో తెరిచిన శవపేటికలో ఉంచుతారు. ఇంటి ప్రజలు ఈ శవపేటిక చుట్టూ నిలబడి మృతదేహంతో కబుర్లు చెప్తారు. చనిపోయిన వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడని భావించి మృతదేహాన్ని ఇంట్లో ఉంచారు. ఇంటికి వచ్చే అతిథులను పరిచయం చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే చనిపోయిన వ్యక్తి కూడా తమతో పాటే బ్రతికే ఉన్నాడనే భ్రమలో వాళ్లు జీవిస్తుంటారు.

ఇంకా హైలెట్‌ ఏంటంటే.. సులవేసిలో టోర్జాలోని చాలా ఇళ్లలో 15 నుంచి 20 ఏళ్ల నాటి మృతదేహాలు ఉన్నాయి. కొన్ని పురుగులు తిన్నట్లు పూర్తిగా కుళ్లిపోయి ఉన్నాయి. అయితే ఆ వాటి వాసన రాకుండా.. బయటకు కనిపించకుండా మృతదేహాలపై బట్టలు కప్పి ఉంచుతారట. ఇంట్లో చిన్న పిల్లలతో సహా ఈ సంప్రదాయాన్ని చాలా ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. మరణించిన వారు అనారోగ్యంతో ఉన్నందున నిద్రిస్తున్నారని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు.

ఇది సంప్రదాయం అయినప్పటికీ.. ఇలా మృతదేహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల బాక్టీరియా వృద్ధి చెంది అది పలు రకాల వైరస్‌లకు కారణం అవుతుంది. భరించలేని వాసన వస్తుంది. వాళ్లు సంప్రదాయం మాటున ఇలా అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇదొక్కటే కాదు మనదేశంలో కూడా ఇలాంటి విచిత్రమైన పద్ధతులు అనుసరించే వాళ్లు నేటికీ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news