తెలంగాణ రాష్ట్రంలో మరో 100 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం తెలంగాణాలో ఉన్న అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అధికారంలో ఉన్న BRS వరుసగా మూడవ సారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని తంటాలు పడుతోంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలో కాంగ్రెస్ చేపట్టనున్న బస్సు యాత్ర గురించి మాట్లాడారు. ఎన్నికల యుద్దానికి ఇంకా కేవలం 100 రోజులు మాత్రమే ఉంది, ఈ యుద్ధంలో ప్రజల తరపున మేమె గెలుస్తాం.. ప్రజలు మమ్మల్ని తమ ఓట్లు వేసి గెలిపిస్తారు అంటూ ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ తో చర్చించి త్వరలోనే బస్సు యాత్ర షెడ్యూల్ ను ఖరారు చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు మేము కేసీఆర్ లాగా నెరవేర్చలేని 100 హామీలను ఇచ్చే రకం కాదు. మా ఎన్నికల మానిఫెస్టోలో కీలకం అయిన 5 హామీలను పొందుపరుస్తాము, వాటిని తూచా తప్పకుండా పాటిస్తాం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.
మరి కోమటిరెడ్డి చెప్పిన బస్సు యాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ? కాంగ్రెస్ మానిఫెస్టోలో 5 అంశాలేనా ? ప్రజలు నమ్ముతారా లాంటి చాలా ప్రశ్నలకు సమాధానం కావాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.