తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చెదురుముదురు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కానీ నిన్న రాత్రి నుండి మాత్రం ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా అన్నట్లుగా వరుణుడు భాగ్యనగరం పై తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అస్సలు ఒక్క నిముషం కూడా ఎడతెరిపి ఇవ్వకుండా కురుస్తూనే ఉంది. ఈ భయంకర వర్షానికి హైద్రాబాద్ నగర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఇప్పటికీ వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది, దీనితో అప్రమత్తం అయిన GHMC మేయర్ విజయలక్ష్మి ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఈ వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు..కాబట్టి ఎవ్వరూ కూడా బయటకు వచ్చే సాహసం చేయొద్దు. అందరూ ఇంట్లోనే ఉండాలని తెలియచేసింది. కాగా ఈ అవసరం వచ్చినా ఖచ్చితంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ (040 – 21111111) కు కాల్ చేయండి అంటూ చెప్పింది.
ఇక వర్షం హైద్రాబాద్ లోని పలు చోట్ల జూబిలీ హిల్స్, వెంకటగిరి, ఫిలిం నగర్, ఎస్ ఆర్ నగర్, అమీర్పేట్ , ఈ ఎస్ ఐ, ఎర్రగడ్డ లో పడుతోంది.