బీజేపీ చీఫ్ గా రేపే కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం… !

-

కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రిగా కొన్ని రోజుల ముందు వరకు కొనసాగిన తెలంగాణ ఎంపీ కిషన్ రెడ్డు రేపటి నుండి కొత్త అవతారాన్ని ఎత్తబోతున్నాడు. ఈ మధ్యనే బీజేపీ అధిష్టానం జరిపిన మీటింగ్ లలో కొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మరియు మంత్రులను మార్పులు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కిషన్ రెడ్డిని మంత్రి నుండి తెలంగాణ బీజేపీ సారధిగా నియమిస్తూ ఉత్తర్వులు జరీ చేసింది. ఇక బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తీసేయివేసి మంత్రి పదవిని ఇవ్వడానికి చూస్తోంది. కాగా ఎంపీ కిషన్ రెడ్డి రేపు తెలంగాణ బీజేపీ అద్యక్షకుడిగా ప్రమాణ స్వీకారాన్ని చేయనున్నారు. అధికారిక సమాచారం ప్రకారం రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ పార్టీ ఆఫీస్ లో తన బాధ్యతలను నేతల సమక్షములో తీసుకోనున్నారు.

కాగా బాధ్యతలను స్వీకరించే ముందు కిషన్ రెడ్డి పాతబస్తీలో వెలసిన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ఆమె ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత అంబెడ్కర్, పూలే విగ్రహాల వద్ద నివాళులు అర్పించి బీజేపీ కార్యాలయానికి ర్యాలీ గా వెలుతారట.

Read more RELATED
Recommended to you

Latest news