ఏ కారణం చెప్తే ఎక్కువ పీఎఫ్‌ అమౌంట్‌ విత్‌డ్రా చేసుకోవచ్చు..?

-

ఉద్యోగుల శాలరీ అడగితే కటింగ్స్‌ పోను ఇంత వస్తుంది అంటారు. ఆ కటింగ్స్‌ అన్నీ పోయేది పీఎఫ్‌ అకౌంట్‌లోకి. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్‌ అకౌంట్ ఉంటుంది కానీ దానిపై చాలా తక్కువ మందికే అవగాహన ఉంటుంది. డబ్బులు ఎంత ఉంటున్నాయి, మనకు కావాల్సినప్పుడు ఎలా తీసుకోవాలి, వీటిలో డబ్బు ఉంటే మేలా తీసినా ఏం కాదా ఇదంతా తెలుసుకోవడం చాలా అవసరం. అయితే ఈరోజు మనం ఏ కారణం చెప్తే ఎంత డబ్బు విత్‌డ్రా అవుతుందో చూద్దాం. మనకు ఒక్కోసారి ఎక్కువ అమౌంట్‌ కావాల్సి ఉంటుంది కానీ ఆ కారణం చెప్తే తీరా అకౌంట్‌లో తక్కువే పడతాయి. ఏ కారణంపై ఎంత వరకు డబ్బులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎఫ్‌ అమౌంట్‌ విత్‌డ్రా
పీఎఫ్‌ అమౌంట్‌ విత్‌డ్రా

ఈపీఎఫ్ ఖాతాదారులు.. పెళ్లి కోసం 50 శాతం వరకు పీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విత్‌డ్రా కోసం మాత్రం ఏడేళ్ల సర్వీస్ పూర్తయి ఉండాలి. ఈపీఎఫ్ సభ్యుడు లేదా వారి కొడుకు/కూతురు/సోదరుడు లేదా సోదరి పెళ్లి కోసం డబ్బులు తీసుకోవచ్చు. ఇక ఉన్నత చదువుల కోసం కూడా 50 శాతం వరకు డబ్బులు వస్తాయి.

కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేసేందుకు పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. ఇక్కడ ఐదేళ్ల సభ్యత్వం అవసరం. ఇంటి స్థలం కొనుగోలు చేసినందుకు నెలవారీ జీతం కంటే 24 రెట్లు, ఇల్లు కొనుగోలు చేసేందుకు మాత్రం 36 రెట్ల వరకు డ్రా చేయొచ్చు. ఇంటి నిర్మాణానికి 36 రెట్లు వస్తుంది. ఇంటి రెనోవేషన్ కోసం మాత్రం నెల జీతం కంటే 12 రెట్లు డ్రా చేయొచ్చు.

ఆస్పత్రి ఖర్చుల కోసం కూడా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఉద్యోగి నెలవారీ జీతానికి 6 రెట్లకు సరిపడా నగదు తీసుకోవచ్చు.

ఉద్యోగి మరో సంవత్సరంలో రిటైర్ అవుతున్నాడనుకుంటే.. అప్పుడు పీఎఫ్ అకౌంట్ నుంచి 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. రిటైర్మెంట్‌కు ఏడాది లోపే ఇది వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news