వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు నాయకులు అంతా టీడీపీ పైన అమరావతి పెడ్లాల ఇళ్ల విషయంలో విరుచుకుపడుతున్నారు. ఉదయం వెంకటపాలెం లో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మరియు మంత్రి జోగి రమేష్ లు చంద్రబాబును మరియు అతని కుటిల వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు బట్టబయలు చేయగా.. తాజాగా మంత్రి ఆదిమూలపు సురేష్ గతంలో అమరావతి ప్రాంతంలో ఉన్న పేదలకు ఇల్లు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు టీడీపీ లేనిపోని అడ్డంకులు సృష్టించిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలను టీడీపీ కేవలం ఒక ఓటు బ్యాంకు లాగానే చూసిందని ఏనాడూ మానవత్వంతో అలోచించి వారికి అవసరం అయిన కనీస వనరుల గురించి పట్టించుకోలేదని చంద్రబాబు పై రెచ్చిపోయి మాట్లాడారు. కానీ సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్ని కష్టాలు ప్రతిపక్షము కలిగించినా ప్రజల పక్షాన నిలబడి వారికి ఇల్లు ఇవ్వడానికి నిర్మాణం చేయడానికి నడుం బిగించిందని మాట్లాడారు మంత్రి సురేష్.
ఇప్పటి వరకు 30 లక్షల మందికి పట్టాలను ఇచ్చామని మంత్రి సురేష్ తెలిపార